దివ్యాంగులను మోసం చేసిన కాంగ్రెస్‌

‌- వారికి రూ.6వేల పెన్షన్‌ ‌హామీ ఏమయ్యింది
– దివ్యాంగులకు మద్దతుగా రేపు ధర్నా
– ప్రభుత్వ తీరుపై మండిపడ్డ  ‌కేటీఆర్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: దాదాపు ఆరున్నర, ఏడు లక్షల మంది దివ్యాంగులకు కాంగ్రెస్‌ ‌పార్టీ చాలా వాగ్దానాలు ఇచ్చింది. 100 రోజుల్లోనే రూ.6 వేల పెన్షన్‌ అని చెప్పింది.  ఆ పెన్షన్‌ ఇం‌కా ఎందుకివ్వడం లేదని  ప్రభుత్వాన్ని  బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. దివ్యాంగులతో కలిసి మీడియాతో కేటీఆర్‌ ‌మాట్లాడుతూ కాంగ్రెస్‌ ‌పార్టీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. బ్యాక్‌ ‌లాగ్‌ ‌పోస్టుల విషయంలో, చదువుల విషయంలో చాలా వాగ్దానాలు వారి అభయహస్తం మేనిఫెస్టోలో చాలా వివరంగా ఇచ్చారు. అవన్నీ కూడా మా సోదరుల దగ్గర చాలా వివరంగా వారి ఫోన్లలో, వారి మనసుల్లో ముద్రించుకొని పోయి ఉన్నయి. తెల్లారి లేస్తే శారీరకంగా అవస్థలు పడే దివ్యాంగులు కోరుతున్నది ప్రత్యేకంగా కొత్తగా ఏం లేదన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్‌ ‌పార్టీగా ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వారు ఇవాళ అసెంబ్లీలోకి రావాలని ప్రయత్నం చేశారు. నేనడిగాను అసెంబ్లీలో లోపలికి రానీయండి.. మా లెజిస్లేచర్‌ ‌పార్టీ ఆఫీస్‌లో కలుద్దాం. వారు బయట రోడ్డు మీద కలవటం కరెక్టు కాదు. కానీ వీళ్లంతా వస్తే మాకేదో ఇబ్బంది అయితది. వాళ్లను వద్దు అని చెప్పి పాసులు కూడా ఇయ్యకుండా సతాయిస్తే వారిని నడిరోడ్డు మీద కలవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. దివ్యాంగుల గురించి కల్ల‌బొల్లి కబుర్లు చెప్పి ఓట్లు పొంది గ్దదెనెక్కిన కాంగ్రెస్‌ ‌పార్టీని మేం ఈ బ్జడెట్‌ ‌సెషన్‌లో అడుగుతాం.. నిలదీస్తాం. రూ.6 వేల పెన్షన్‌ ఇం‌కా ఎందుకివ్వడం లేదు. పక్క రాష్ట్రంలో రూ.6 వేల పెన్సన్‌ ఇస్తున్నరు. మీరు గ్దదెనెక్కిన తర్వాత మూడో బ్జడెట్‌ ఇది 60 శాతం సమయం అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇంకా డబ్బులు కేటాయించడం లేదు. నిలదీస్తాం. దీంతోపాటు దివ్యాంగులకు గతంలో మేం డబుల్‌ ‌బెడ్‌రూం ఇండ్లు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేసినం. ప్రతీ దాంట్లో కోటా పెట్టి వారిని ఆదుకునే ప్రయత్నం చేశాం. భవిష్యత్‌లో ఇంకా ఎక్కువ చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం దివ్యాంగ సోదరసోదరీమణులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని కేటీఆర్‌ ‌హెచ్చరించారు. నేడు ఇందిరాపార్క్ ‌దగ్గర వాళ్లు రిలే నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు దానికి కూడా మా మద్దతు ఉంటుంది. పార్టీ నాయకులం కూడా హాజరవుతాం. తప్పకుండా దాన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా దివ్యాంగ సోదరులను విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *