బీసీలను మోసం చేసిన కాంగ్రెస్‌

-‌ వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం
– మహబూబ్‌నగర్‌లో దొడ్డి కొమురయ్యకు హరీష్‌రావు నివాళి

మహబూబ్‌నగర్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3:‌ బీసీలకు, కుర్వ, గొల్ల, కురుమలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్‌ ‌పట్టణంలో కొమురయ్య విగ్రహానికి మాజీ మంత్రులు హరీష్‌ ‌రావు, శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌ ‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ ‌తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ బీసీలకు వేల కోట్ల బడ్జెట్‌ ఇస్తామని రూ. 7 కోట్లు మాత్రమే నిధులు ఖర్చు చేసినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. శాసన సభలో రేవంత్‌ ‌ప్రభుత్వాన్ని నిలదీసినట్టు వెల్లడించారు. యాదవులకు గోర్లు ఇస్తామని, నగదు బదిలీ పథకం అమలు చేస్తామని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. కనీసం మంత్రి వర్గంలో అవకాశం కల్పించలేదని చెప్పారు.దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని శ్రీనివాస్‌ ‌గౌడ్‌, శ్రీ‌నివాస్‌ ‌యాదవ్‌ ‌కేసీఆర్‌ను కోరితే వెంటనే అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌మాట్లాడుతూ మహబూబ్‌ ‌నగర్‌ ‌పచ్చబడాలని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు హరీష్‌ ‌రావు అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. గతంలో 14 రోజులకు ఒకసారి నీళ్లు రాగా బీఆర్‌ఎస్‌ ‌హయాంలో ప్రతి రోజు నీళ్లు ఇచ్చామని వివరించారు.
రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేమని, సాగు నీరు అందించేందుకు పూర్తి ప్రయత్నాలు చేసామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్ట్ 90 ‌శాతం పూర్తి చేశామని వెల్లడించారు. రాజకీయంగా బీసీలకు సమాన అవకాశాలు కల్పించాలని, బీసీ లకు 42 శాతం రిజర్వేషన్‌ ‌లు ఇస్తామని మోసం చేశారని తెలిపారు .విద్య, ఉద్యోగాల్లో కూడా రిసర్వేషన్‌ ఇవ్వడం లేదని ఆరోపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *