– మంత్రి సీతక్క పిలుపు
ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా జీహెచఎంసీ పరిధిలోని బహీంపట్నం మున్సిపాలిటీ బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల తరపున శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొని కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులకు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క పాల్గొని చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తున్నామని, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని పట్టణాలను మరింత అభివృద్ధి చేసుకుందామని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ప్రచారంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, జిల్లా నాయకులు, చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




