– పంచాయతీ ఎన్నికల ప్రచారంలో బీర్ల పిలుపు
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 13:యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలంలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలు, నాయకులకు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. మండలంలోని ఆరెగూడెం, దిలావర్ పూర్, మాటూరు, అమ్మనాబోలు, తేర్యాల, చామపూర్, చందేపల్లి, చాడ ముత్తిరెడ్డి గూడెం, కొండాపూర్, నాంచారి పేట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో స్థానికులు , పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



