కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట

– బాల్క సుమన్‌ అరెస్టు దుర్మార్గం
– కాంగ్రెస్‌ అ‌క్రమాలను ఎదరించినందుకా..
– మండిపడ్డ మాజీమంత్రి హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18: క్యాతనపల్లిలో కాంగ్రెస్‌ అ‌ప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే, దళిత నాయకుడు బాల్క సుమన్‌ ‌ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. క్యాతన్‌ ‌పల్లిలో బీఆర్‌ఎస్‌కి పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్‌ ‌పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు చూసి యావత్‌ ‌తెలంగాణ అసహ్యించుకుంటున్నదని అన్నారు. అధికార , పోలీసు, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్‌ అరాచక వైఖరికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. రాష్ట్రమంతా కాంగ్రెస్‌ ‌మార్కు గూండాగిరి రాజ్యమేలుతున్నదన్నారు. హంగ్‌ ‌వచ్చినచోటల్లా ప్రతిపక్ష నాయకులను సంత సంత‌లో ప‌శువులను కొన్న‌ట్లు చేస్తూ కిడ్నాపులకు తెగబడుతూ ప్రజా తీర్పును కాలరాస్తున్న తీరుకు నిదర్శనాలు ఎన్నో అని అన్నారు. జనగాంలో దళిత మహిళా కౌన్సిలర్‌ ‌బీఆర్‌ఎస్‌కు మద్దతుగా చెయ్యి ఎత్తితే రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ‌సాక్షిగా కాంగ్రెస్‌ ‌గూండాలు చేసిన దాడిని సమాజం కళ్లారా చూసిందని వెల్లడించారు. అధికారులు, పోలీసులు కళ్లప్పగించి చోద్యం చూశారే తప్ప అడ్డుకోలేదన్నారు. ఒక్క క్యాతనపల్లే కాదు తొర్రూరు, జనగాం, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్‌ ‌సహా హంగ్‌ ‌వచ్చిన ప్రతిచోటా ప్రజా తీర్పును గౌరవించకుండా చైర్మన్‌ ‌పీఠాలను అడ్డదారుల్లో దక్కించుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో భూములను కబ్జా చేసినట్లే రాజకీయ పీఠాలను కూడా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. బాల్క సుమన్‌ ‌ను బేషరతుగా విడుదల చేయాలని, ప్రజాస్వామిక వాతావరణంలో క్యాతన్‌ ‌పల్లి చైర్మన్‌ ఎన్నిక జరిగేలా చ‌ర్య‌లు తీసుకోవాలలని ఎన్నికల కమిషన్‌ ‌ను హరీష్‌రావు డిమాండ్‌ ‌చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *