వందేమాతరంతో ఆత్మవిశ్వాసం

– అది భవిష్యత్తుకు సరికొత్త భరోసా
– వందేమాతరం 150వ స్మారకోత్సవంలో ప్రధాని మోదీ

దిల్లీ, నవంబరు 7: వందేమాతరం శబ్దం విన్నంతనే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని ప్రధాని మోదీ అన్నారు. భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందన్నారు. దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ ‌స్టేడియంలో శుక్రవారం జ‌రిగిన వందేమాతరం 150వ స్మారకోత్సవంలో ఆయ‌న‌ మాట్లాడారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్లమంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి శుక్రవారంతో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గేయాన్ని నవంబరు 7, 1875న బంకించంద్ర ఛటర్జీ రచించారు. ఈ గేయం తొలిసారి ఛటర్జీ రాసిన ఆనంద్‌ ‌మఠ్‌ నవలలో ప్రచురితమైంది. వందేమాతరం గేయం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రం అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. అది దేశమాత ఆరాధన, సాధన అని పేర్కొన్నారు. ఈ గేయం మనందరినీ పురాణ ఇతిహాసాల్లోకి తీసుకెళ్తుందని చెప్పారు. ఈ సామూహిక గేయాలాపన అద్భుత అనుభవం. ఒకే లయ, స్వరం, భావంతో గేయాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుందని అన్నారు. వందేమాతరం స్మారక స్టాంపు, నాణెం విడుదల చేశాం. ప్రతి గీతానికి ఒక మూలభావం, సందేశం ఉంటుంది. మన వందేమాతరం మూలభావం భారత్‌, ‌మా భారతి అని పేర్కొన్నారు. ఇది దేశానికి ఒక ప్రార్థన లాంటిదన్నారు. ఇది మన భవిష్యత్తుకు ధైర్యాన్ని ఇస్తుంది. భారతీయులు సాధించలేని సంకల్పం లేదు. సాధించలేని లక్ష్యం లేదని మోడీ పేర్కొన్నారు. నవంబర్‌ 7 అనేది ఒక చరిత్రాత్మక రోజు అని.. వందేమాతరం ఆవిర్భవించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కోట్లాది మంది భారతీయుల్లో కొత్త శక్తిని ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక 1950లో భారతదేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన సందర్భంగా ఈ వందేమాతరం గేయాన్ని జాతీయ గేయంగా గుర్తించారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ 2025 సంవత్సరాన్ని 150 ఏళ్ల ‘వందే మాతరం‘గా పరిగణించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *