క్రీడాకారులకు రైలు చార్జీల్లో రాయితీ

కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్‌

దిల్లీ, ప్రజాతంత్ర, జులై 7: జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరే రైలు ప్రయాణ చార్జీల్లో రాయితీ కల్పించాలని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  దిల్లీలో భేటీ అయ్యారు. ఖేలో ఇండియా గేమ్స్‌, 40వ నేషనల్‌ గేమ్స్‌, ఏవైనా ఇతర జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా పథకం కింద క్రీడాకారుల శిక్షణ, క్రీడా వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *