సుస్థిర, దీర్ఘకాలిక రవాణా వ్యూహ రూపకల్పనకు సీఎంపీ

– ప్లాన్‌ తయారీకి కన్సల్టెన్సీగా మెసర్స్  లీ అసోసియేట్స్
– భాగస్వామ్య విభాగాల సమన్వయ సమావేశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్ఎండీఏ) ద్వారా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతం (హెచ్ఎంఏ) కోసం సమగ్ర మొబిలిటీ ప్రణాళిక (కాంప్రెహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌) 2050 తయారీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సీఎంపీ ప్రతిపాదిత మాస్టర్‌ ప్లాన్‌ 2050లో అంతర్భాగంగా ఉంటుంది. దీని లక్ష్యం సుస్థిరమైన, దీర్ఘకాలిక రవాణా వ్యూహాన్ని రూపకల్పన చేయడం, జాతీయ పట్టణ రవాణా విధానం (ఎన్‌యూటీపీ) 2006/2014, అలాగే హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హెచ్ఎంఆర్ఎల్‌, ఇతర భాగస్వామ్య సంస్థల ప్రణాళికలకు అనుగుణంగా సమర్థవంతమైన పెట్టుబడి కార్యక్రమాలను గుర్తించడం. మెసరన్స లీ అసోసియేట్స్‌ సౌత్‌ ఏషియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కన్సల్టెన్సీ సంస్థను సీఎంపీ తయారీకి కన్సల్టెంట్‌గా నియమించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతం 2050 కోసం సీఎంపీ ముసాయిదా నివేదికపై ముఖ్య భాగస్వామ్య విభాగాల సమావేశం రసూల్‌పురాలోని హెచ్ఎంఆర్ఎల్‌ కార్యాలయంలో మంగళవారం ఉదయం నిర్వహించారు. ఈ సమావేశానికి హెచ్ఎండీఏ కమిషనరన సర్ఫరాజ్‌ అహ్మద్‌ అధ్యక్షత వహించారు. వివిధ భాగస్వామ్య విభాగాల నుండి అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌ అర్బన్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (హెచ్ఎంటీఏ), జీహెచ్ఎంసీ, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎంఆర్ డీసీఎల్), హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌(హెచ్‌జీసీఎల్),
హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌ఆర్నడీసీఎల్) ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఎఫ్‌సీడీఏ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ),తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీసీఐఐసీ), తెలంగాణ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (టీజీఆర్టీగసీ), ట్రాఫిక్‌ పోలీస్‌ (హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ), హెచ్ఎండీఏ ప్రతినిధులు పాల్గొన్నారు. విభాగాల మధ్య సమన్వయం అవసరాన్ని హైలైట్‌ చేస్తూ అన్ని భాగస్వామ్య విభాగాలు సీఎంపీ ముసాయిదా నివేదికను సమగ్రంగా పరిశీలించి అభిప్రాయాలు, సూచనలు, శాఖ సిఫారసులు సమర్పించాలని సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆదేశించారు, ఆ నివేదికను సవరించి తుది రూపం కల్పించవచ్చని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *