– అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ పోటీ
– ‘సమ్మిట్’ ఏర్పాట్లను పరిశీలించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ప్రపంచంలోనే రోల్ మోడల్‌గా నిలుస్తుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి శనివారం పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ సమ్మిట్‌కు దేశవిదేశాల నుంచి అనేక రంగాల్లో విశేష గుర్తింపు పొందిన దిగ్గజాలను ఆహ్వానించామన్నారు. గత రెండేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతోపాటు 2037విజన్, 2047 విజన్ ఈ రెండు సెక్టార్లకు సంబంధించిన ప్రభుత్వ లక్ష్యాలు, ఆలోచనలను ఈ సమ్మిట్‌లో వివరించబోతున్నామన్నారు. గడువులోగా పూర్తిస్ధాయి ఏర్పాట్లకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ ప్రగతి దేశంలో ఉన్న రాష్ట్రాలతో కాదు.. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్-2047 విజన్‌తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. 2035 నాటికి తెలంగాణ ఆర్ధిక వ్యవస్ధను ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా వృద్ది సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని మంత్రి పొంగులేటి చెప్పారు. కాగా, ఈ సమ్మిట్‌పై ఇండిగో విమానాల రద్దు ప్రభావం ఏమాత్రం చూపదని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దీనిపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



