జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

– మీడియా అకాడమి ఛైర్మన్‌ శ్రీ‌నివాసరెడ్డి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: జర్నలిస్టుల సంక్షేమానికి మీడియా అకాడమి కట్టుబడి ఉందని చైర్మన్‌ ‌కే.శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణ మీడియా అకాడమిలో 2వ పాలకమండలి సమావేశం చైర్మన్‌ ‌శ్రీనివాస్‌ ‌రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 8 జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమాలు, వివిధ అంశాలపై 7 వర్క్ ‌షాప్‌ ‌లు, 12 మంది సీనియర్‌ ‌జర్నలిస్టులు చేసిన సేవలను రాబోయే తరాలకు తెలియపర్చాలనే ఉద్దేశ్యంతో వారి జీవితాలపై మోనోగ్రాఫ్స్ ‌ముద్రించినట్లు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమంలో భాగంగా విడతల వారీగా 120మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సహాయం, 5 సంవత్సరాల కాలపరిమితితో నెలకు రూ.3 వేలపెన్షన్‌ ‌సదుపాయం కల్పించినట్లు ఆయన వివరించారు. అదేవిధంగా అనారోగ్యం, ప్రమాదాలకు గురైన 19 మంది జర్నలిస్టులకు ఆర్థిక సహాయం చేశామన్నారు. అకాడమి భవన నిర్వహణలో భాగంగా 250 మంది సీటింగ్‌ ‌కెపాసిటీ గల ఆడిటోరియం అద్దెకు ఇవ్వడానికి సమావేశంలో చర్చించగా కమిటీ సభ్యులు తమ ఆమోదం తెలపడం పట్ల కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వర్నింగ్‌ ‌కౌన్సిల్‌ ‌సభ్యులు మీడియా అకాడమి భవన నిర్వహణలో భాగంగా ఆడిటోరియం అద్దెకు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తునే ఈ విధానం పూర్తిగా ఆన్‌ ‌లైన్‌ ‌విధానం ద్వారా స్లాట్‌ ‌బుకింగ్‌ ‌చేసుకునే విధంగా మీడియా అకాడమి వెబ్‌ ‌సైట్లో ఆయా తేదీలు, సమయ పాలనని పొందుపర్చాలని సూచించారు. అప్పుడే పూర్తి పారదర్శకత చేకూరుతుందని వారు వెల్లడించారు. ఈ సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ ‌కషనర్‌ సిహెచ్‌. ప్రియాంక, ఉస్మానియా వర్సిటీ జర్నలిజం డిపార్టుమెంట్‌ ‌హెడ్‌ ‌డాక్టర్‌ ‌సతీష్‌ ‌కుమార్‌ ‌తల్లాడి, డాక్టర్‌ ‌బి.ఆర్‌. అం‌బేద్కర్‌ ‌విశ్వవిద్యాలయ జర్నలిజం, మాస్‌ ‌కమ్యూనికేషన్‌ ఇం‌చార్జి హెడ్‌ ‌డా. సునిల్‌ ‌కుమార్‌ ‌పోతన, దూరదర్శన్‌ ‌కేంద్ర ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎ.చాందిని, ఆల్‌ ఇం‌డియా రేడియే ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌ ‌డైరెక్టర్‌ ఎస్‌.రమేష్‌ ‌సుంకసారి, స్పెషల్‌ ‌గెస్ట్ ‌చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం జర్నలిజం డిపార్టుమెంట్‌ ‌హెడ్‌ ‌బి.వి.కృష్ణాజీరావు, మీడియా అకాడమి  కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *