బీసి కులాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ 

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 3:కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం బీసీ కులాల అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. వివిధ వెనుకబడిన కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని, భూములు కూడా కేటాయించామని మండలిలో ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు. గత ప్రభుత్వం కుల సంఘాలకు చేసిందే లేదన్నారు. తమ సర్కారు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని.. అధికార, రాజకీయ పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. త్వరలో అన్ని కార్పొరేషన్లను బలోపేతం చేస్తామని తెలిపారు. వెనుకబడినవర్గాల నైపుణ్యాభివృద్ధి పథకం తీసుకొస్తామని వెల్లడించారు.  శాసనమండలిలో శుక్రవారం సభ్యులు వివిధ సమస్యలపై గళమెత్తారు. తొలుత ప్రశ్నోత్తరాల సమయం, అనంతరం ప్రత్యేక ప్రస్తావనలు.. ఆ తర్వాత వినతులు ఇచ్చేందుకు కూడా మండలి ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌రెడ్డి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. పలు సందేహాలను నివృత్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలకు సంబంధించి అపరిష్క•తంగా ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ ఏడాది బ్జడెట్లో బీసీ కార్పొరేషన్‌ ‌భవనాలకు నిధులు కేటాయించాలని భారాస మండలిపక్ష నేత మధుసూదనాచారి కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *