మున్సిపల్ ఎన్నికల వేళ 47మంది కమిషనర్ల బదిలీ

– తక్షణం విధుల్లో చేరాలని ఆదేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి21:మున్సిపల్ ఎన్నికలకు ముందు పలువురు కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఏకంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే విధుల్లో చేరాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సొంత జిల్లాల్లో ఉన్నవారిని, అలాగే ఒకే చోట మూడేళ్లు దాటిన వారిని మార్చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బదిలీ వివరాలు ఇలా ఉన్నాయి. సి.వి.ఎన్. రాజు- మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-ఎఎఎ)- ఆదిలాబాద్ మున్సిపాలిటీ, ఉమామహేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-ఎఎ) ప్రస్తుతం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో సెక్రటరీగా పనిచేస్తున్నారు. కె.సమ్మయ్య-సెక్షన్ ఆఫీసర్, సచివాలయం హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయ్యారు. కీర్తి నాగరాజు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-ఎఎఎ), చొప్పదండి మున్సిపాలిటీకి, టి. మనోహర్, మేనేజర్, రాయికల్ మున్సిపా లిటీలో మున్సిపల్ కమిషనర్గా, ఎ. శ్రీనివా సరావు, ఎంపీడీఓ, ఎదులాపురం మున్సిపా లిటీలో మున్సిపల్ కమిషనర్, ఎం. రామదుర్గ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-ఎఎ), హాలియా మున్సిపాలిటీ, నజీబ్, మేనేజర్, భూత్పూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ (ఓడీ ప్రాతిపదికన), నాగరాజు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-ఎఎఎ), అమర్చింత మున్సిపాలిటీ, కె.సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-ఎఎఎ), మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, టి.రమేష్, మేనేజర్, బెల్లంపల్లి మున్సిపా లిటీలో మున్సిపల్ కమిషనర్ జె.సంపత్, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-ఎఎఎ), ములుగు మున్సిపాలిటీ, ఎం.రామచంద్రరావు, ఎంపీఓ, కల్లూరు మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ గా (ఓడీ ప్రాతిపదికన), ఎం. మునావర్ అలీ, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-ఎఎఎ), తిరుమలగిరి మున్సిపాలిటీ, జి.రాజు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-ఎఎ), క్యాతనపల్లి మున్సిపాలిటీ, పి. చంద్రశేఖర్ రావు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-ఎఎ), కొల్లాపూర్ మున్సిపాలిటీకి బదిలీ అయ్యారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *