* సురక్షిత నగరంగా నిలబెట్టడానికి పోలీసు శాఖ కృషి
* గణతంత్ర వేడుకల్లో నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి26: దేశ భద్రత కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ను దేశంలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో సురక్షిత నగరంగా నిలబెట్టడానికి పోలీసు శాఖ కృషి చేస్తోందని సీపీ సజ్జనార్ తెలిపారు.77వ గణతంత్ర దినోత్సవం సందర్భoగా నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా పేట్లబురుజులోని కార్ హెడాక్వార్టర్స్లో జాతీయ జెండాను ఎగురవేసిన సీపీ.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు అత్యంత పవిత్రమైనదని, స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు: ప్రాణత్యాగం చేశారని గుర్తుచే శారు. దేశ భద్రత కోసం వేలాది మంది పోలీసులు తమ ప్రాణాలను అర్పించారని పేర్కొన్నారు.
ఇందుకోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నా మని, ప్రజల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని వివరించారు. పోలీసింగ్లో మానవీయ దృక్పథం ఉందన్న ఆయన.. విక్టిమ్, సిటీజన్ సెంట్రిక్ అప్రోచ్ బాధితులకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా బాధితుల ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేసే వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అమలు చేశామని గర్వంగా పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల కేసుల్లో తక్షణ చర్యలు, 24/7 స్పందన ఉంటుందని తెలిపారు. యాప్ ద్వారా ప్రజల భద్రతను మరింత బలోపేతం చేస్తున్నామని సజ్జనార్ వివరించారు. కేసులు నమోదు చేయడమే కాదు.. బాధితులకు న్యాయం అందేవరకూ పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేశారు. నేరాల నివారణేళి లక్ష్యంగా విధా నాన్ని అనుసరిస్తున్నా మన్నారు. ట్రాఫిక్ ని యంత్రణలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ద్వారా రోడ్డు ప్రమా దాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీపీ తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి చేశామని.. ప్రాణ రక్షణళి ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. సీపీ: డ్రంక్ అండ్ డ్రైవ్ పై జీరో టాలరెన్స్ దిశగా కఠిన చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రత్యేక నిఘా, వేగవంతమైన చర్యలు తీసుకుం. టున్నామని తెలిపారు. ప్రజల విశ్వాసమే పోలీసి ంగు బలమని, శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచామని చెప్పారు. ప్రజల సహకారంతోనే సురక్షిత సమాజం సాధ్యమని ఆయన అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ విలువల పట్ల అందరూ నిబద్ధత చూపాలని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





