వాణిజ్య‌ ప‌న్నులు, మైనింగ్ శాఖల్లో ఆదాయం పెరుగుద‌ల‌

– ఆదాయంలో వెనుక‌బ‌డ్డ మిగిలిన శాఖ‌లు
– డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 8:  కమర్షియల్ టాక్స్ శాఖలో 4.7%, మైన్స్ శాఖలో 18.6 శాతం ఆదాయంమెరుగైన‌ప్ప‌టికీ,  ఇతర శాఖల్లో ఆదాయ సమీకరణలో వెనుకబాటు కనిపిస్తున్న‌దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ సబ్ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కమిటీ సభ్యులు, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.  భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో పూడికతీత పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్  కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ పూడిక తీత పనులతో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుంది, ఇసుక ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందనీ మంత్రి ఉత్తమ్ వివరించారు. మొదట ఒక ప్రాజెక్టులో పూడికతీత కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక తవ్వకం పనులను పూర్తిగా ట్రైబల్ ఏజెన్సీల ద్వారా నిర్వహించాలని మంత్రులు సూచించారు. గిరిజనులకు యంత్ర సామాగ్రి అందుబాటులో ఉండదు ఈ నేపథ్యంలో ఐటీడీఏలోని ఇంజనీరింగ్ విభాగం యంత్ర సామాగ్రి సహాయం అందించాలని మంత్రులు సూచించారు. దీని ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని  మంత్రులు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమల తరలింపునకు మూడు వారాల్లో విధి విధానాలు రూపొందించాలని మంత్రులు సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్ అండ్ బి స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, మైన్స్ డైరెక్టర్ శశాంక, స్టాప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *