గ్లోబల్‌ సమ్మిట్‌కు రండి

– జార్ఖండ్‌ సీఎం సోరెన్‌కు భట్టి ఆహ్వానం

రాంచీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: హైదరాబాద్‌ భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈనెల 8,9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌ 2047 గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరు కావాలని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రత్యేకంగా ఆహ్వానించారు. సోరెన్‌ నివాసంలో శుక్రవారం జరిగిన ఈ భేటీలో గ్లోబల్‌ సమ్మిట్‌ ఆహ్వాన పత్రికను భట్టి విక్రమార్క అందజేశారు.3 మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం ంబaతీబీవ దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు వివరించారు.నీతి అయోగ్‌? సలహాలు సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేథో మథనంతో తయారు చేసిన ఈ విజన్‌? డాక్యుమెంట్‌? ను గ్లోబల్‌? సమ్మిట్‌? లో ఆవిష్కరించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జార?ండ్‌ సీఎం కు వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *