– గవర్నర్‌కు ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రలు, పూజారులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5: ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన మేడారంలో ఈనెల 29నుంచి 31వ తేదీ వరకు జరిగే మహాజాతరను సందర్శించాలని రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మకు మంత్రులు సీతక్క, కొండా సురేఖలు లోక్ భవన్‌లో సోమవారం కలిసి విజ్ఞప్తి చేశారు. మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర ఆహ్వాన పత్రికను ఆలయ ఆచారం ప్రకారం పూజారులు, ఈవో వీరస్వామిలతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా జాతరలో శాశ్వత ప్రాతిపదికన చేపడుతున్నఅభివృద్ధి పనుల వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆదివాసీ సాంస్కృతిక వైభవంతో నిండిన ఆ మహా జాతరను ఒక రోజుతప్పకుండా దర్శిస్తానని గవర్నర్ వారికి హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



