సరస్వతీ పుష్కరాలకు రండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి సురేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగనున్న సరస్వతీ పుష్కరాలకు హాజరుకావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. ఈ మేరకు మంగళవారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సరస్వతి పుష్కరాలకు మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు.  సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *