మ‌హా మేడారం జాత‌ర‌కు త‌ర‌లి రండి

– స‌భాప‌క్ష నేత‌ల‌కు, కౌన్సిల్ చైర్మ‌న్‌కు మంత్రి సీత‌క్క ఆహ్వానం

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 6: ఈనెల 28నుంచి 31వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న మ‌హా మేడారం జాత‌ర‌కు రావాల్సిందిగా గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తీరాజ్ శాఖ‌ల మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క శాస‌న‌స‌భాప‌క్ష నేత‌ల‌కు, శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ కు ఆహ్వానం ప‌లికారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం బంగారం, తల్లుల కుంకుమ-పసుపుతో ఆహ్వాన ప‌త్రిక‌ను మంగ‌ళ‌వారం వారంద‌రికీ అందజేశారు. అలాగే శాస‌న‌మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి మహా మేడారం జాతరకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందజేశారు. మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఉన్నతాధికారులు.. ఇలా ప్రతి ఒక్కరినీ కలుస్తూ మేడారం మహా జాతరకు మంత్రి సీతక్క ఆహ్వానిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *