తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు తరలి రండి

– కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, ఖట్టర్‌, వైష్ణవ్‌లకు ఆహ్వానం

దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3 : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌లను దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్లమెంటులో బుధ‌వారం విడివిడిగా కలుసుకున్నారు. ఈనెల 8,9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు ఎంపీలు ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ గురించిన లక్ష్యాలను కేంద్ర మంత్రులకు సీఎం వివరించారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరు కావాలని కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కూడా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు. పార్లమెంటులో కేంద్ర మంత్రిని సీఎం కలిసి ‘సమ్మిట్‌’లో ఆవిష్కరించనున్న విజన్‌ డాక్యుమెంట్‌ గురించి వివరించారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు డాక్టర్‌ మల్లు రవి, కుందూరు రఘువీర్‌ రెడ్డి, సురేష్‌ షెట్కార్‌, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, డాక్టర్‌ కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *