- ఫీజు రియంబర్స్‌మెంట్‌పై యాజమాన్యాల అల్టిమేటం
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 1: ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లింపులపై ప్రభుత్వం ఆదివారం అంటే 2వతేదీలోగా నిర్ణయం తీసుకోకపోతే.. ఈ నెల 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ పాటిస్తామని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేష్ బాబు తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన డియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై గత 6 నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రస్తుతం రూ.1200 కోట్ల ఇవ్వాలని అడిగాం. మిగిలిన బకాయిల చెల్లింపులపై రోడ్ మ్యాప్ రూపొందించాలని కోరాం. కేవలం రూ.300 కోట్లు ఇచ్చారు.. ఇంకా రూ.900 కోట్లు దీపావళికి ఇవ్వాలని అడిగాం. నవంబరు ఒకటి నాటికి పెండింగ్ బకాయిలు మొత్తం ఇవ్వాలని కోరాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు అందరినీ కలిశాం. అధికారులు మా విజ్ఞప్తిని పెడచెవిన పెట్టారు. మమ్మల్ని ప్రభుత్వం బెదిరింపులకు గురి చేస్తోంది. మా ద విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వృత్తి విద్యా కాలేజీలు నవంబర్ 3 నుంచి నిరవధిక బంద్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. రేపటిలోగా మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. బంద్ సమయంలో పరీక్షలు వాయిదా వేయాలి. నవంబర్ 6న అన్ని కాలేజీల స్టాఫ్, సిబ్బందితో కలిసి దాదాపు లక్ష మందితో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తాం. నవంబర్ 10 లేదా 11న 10 లక్షల మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. ఒకటి రెండు కాలేజీలకు ఎందుకు బకాయిలు చెల్లించారు. 10శాతం లంచం తీసుకొని ఇచ్చారా. ఆ కాలేజీలపై విచారణ జరపాలి. అత్యంత ఫ్రాడ్ జరిగే దగ్గర విచారణ జరపాలి. ఎమ్మెల్యేలు, అధికారుల ఇళ్ల ముట్టడి చేస్తాం. విద్యార్థులు, తల్లిదండ్రులకు కలిగే అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నాం అని రమేష్‌బాబు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


