– రంగారెడ్డి కలెక్టరేట్‌లో ప్రజా పాలన దినోత్సవం
– జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి ఉత్తమ్‌కుమార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. కలెక్టరేట్‌లో ఆయన జాతీయ పతాకాన్ని అవిష్కరించి వేడుకలను ప్రారంభించి ప్రసంగిస్తూ నైజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాట ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అని, ఆ పోరాటంలో రంగారెడ్డి జిల్లా యువత పాత్ర ఆమోఘమైనది అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో అకుంఠిత దీక్షతో రాష్ట్ర సర్వముఖాభివృద్దికి కృషి చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల నుండే ఎన్నికలపుడు ఇచ్చిన హామీలు అమలు చేయడం ప్రారంభించామని, మహాలక్ష్మి పధకంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 33 కోట్ల 66 లక్షల జీరో టికెట్ల వినియోగం జరగగ్ణాజిల్లా మహిళలకు రూ.462 కోట్ల ఆదా అయిందని చెప్పారు. మహాలక్ష్మి పథóకం కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్ కింద జిల్లాలో ఇప్పటివరకు 2,11,672 మంది లబ్ధిదారులకు 8,28,986 సిలిండర్ల పంపిణీ జరిగిందన్నారు. జిల్లాలో రూ.24 కోట్ల 79 లక్షల సబ్సిడీ అందజేశామని, జిల్లాలో ఇందిరమ్మ ఇంటి పథకం కింద 17,440 మంది లబ్ధిదారుల ఖాతాలలో రూ.71.89 కోట్ల చెల్లింపులు, గృహజ్యోతి పథకం కింద 3.25 లక్షల కుటుంబాలకు జీరో బిల్లు జారీ చేయగా రూ.154.77 కోట్ల సబ్సిడీ చెల్లింపు జరిగిందని, ఆరోగ్యశ్రీ పధకంలో రూ.5 లక్షల పరిమితి నుండి రూ.10 లక్షలకు పెంపుతో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక 70,336 మందికి అందించిన వైద్యానికి రూ.117.86 కోట్ల చెల్లింపు జరిపామని తెలిపారు. రాష్ట్రంలో పదేళ్ల విరామం అనంతరం జులై 14 నుండి సామాన్యులకు కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీ ప్రారంభించగా జిల్లాలో 51,874 కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరు చేశామని వివరించారు. కార్యక్రమంలో రోడ్లు, భవనాల కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు సునీతా రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, టి యూఎఫ్‌ఐడిసి చైర్మన్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





