యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్ 18 : యాదగిరిగుట్ట మండలం యాదగిరి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్లతో మాట్లాడుతూ పేద ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. యాదగిరి గుట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌లోని అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేసి ఎంతమంది సిబ్బంది విధులకు హాజరయ్యారని తెలుసుకున్నారు. డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది రెగ్యులర్‌గా వస్తున్నారా లేదా అని ఆరా తీశారు. సమయ పాలన పాటించి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఓపి రిజిస్టర్‌ను పరిశీలించారు. రోజూ హాస్పిటల్‌కు ఎంతమంది రోగులు వస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మందుల స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. హాస్పిటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పేషంట్‌లతో కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు, వైద్య సిబ్బంది సరిగ్గా వైద్యం చేస్తున్నారా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




