చెక్‌డ్యామ్‌లు కుప్పకూలడంపై అనుమానం

– లోతైన దర్యాప్తు జరిపించాలి
-‌ సిఎం రేవంత్‌ ‌రెడ్డికి కేంద్ర మంత్రి బండి లేఖ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 25:‌ రాష్ట్రంలో చెక్‌ ‌డ్యామ్‌లు కూలిపోవడంపై అనుమానాలున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. వీటిపై విచారణ జరగాలన్నారు. ఎందుకు ఇలా జరుగుతున్నాయో తేల్చాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలో మానేరు నదిపై కట్టిన చెక్‌ ‌డ్యామ్‌లు కూలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనుగుల- గుంపుల వద్ద చెక్‌ ‌డ్యామ్‌ ‌కూలడమే ఇందుకు నిదర్శనమన్నారు. బీఆర్‌ఎస్‌ ‌పాలనలో కమీష‌న్లకు కక్కుర్తి పడి నాణ్యతను గాలికొదిలేయడం వల్లే ఈ దుస్థితి వొచ్చిందన్నారు. గత ప్రభుత్వం హయాంలో చెక్‌ ‌డ్యామ్‌లను నిర్మించిన కాంట్రాక్టర్లు కాంగ్రెస్‌ ‌వాళ్లేనన్నారు. చెక్‌ ‌డ్యామ్‌ల నిర్మాణం, నిధుల చెల్లింపులపై మీరు ఆదేశించిన విజిలెన్స్ ‌విచారణ ఏమైందని బండి ప్రశ్నించారు. ఆనాడు బాధ్యులపై చర్యలు తీసుకొని దిద్దుబాటు చర్యలు తీసుకొని ఉంటే తనుగుల-గుంపుల చెక్‌ ‌డ్యామ్‌ ‌కూలేది కాదన్నారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ‌ఒకదానిపై ఒకట ఆరోపణలు చేస్తూ డ్రామాలాడుతున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చెక్‌ ‌డ్యామ్‌ల నిర్మాణాల్లో అక్రమాలు, కూలిపోవడంపై విచారణ జరిపించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్లపై క్రిమినల్‌ ‌కేసులు నమోదు చేసి, వారి ఆస్తులు జప్తు చేసి ఆ సొమ్ముతోనే మళ్లీ డ్యామ్‌లు నిర్మించాలని బండి సంజయ్‌ ‌డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *