పెరుగుతున్న చలి తీవ్రత

– పడిపోతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్బాద్‌,‌ డిసెంబర్‌ 6: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. హైదరాబాద్‌లో రాత్రి చలి పెరుగుతోంది. ఉత్తర తెలంగాణ చలిగుప్పిట్లోకి వెళుతున్నది. అటు విశాఖ మన్యంలో కూడా చలి పెరిగింది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి చలి తీవ్రత ప్రజలకు వొణుకు పుట్టిస్తుంది. ఇప్పుడే చలి తీవ్రత ఇలా ఉంటే రాబోయే జనవరి మాసంలో ఎలా ఉండబోతుందోనని జనం బెంబేలెత్తిపోతున్నారు. గత పక్షం రోజులుగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మధ్యాహ్నం ఉష్ణోగత్రలు పెరిగిపోయి రాత్రి వేళల్లో చలి తీవ్రత కనిపిస్తుంది. శుక్రవారం ఆదిలాబాద్‌ ‌జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రత 28.0 డిగ్రీల సెల్సియస్‌ ‌కాగా కనిష్ఠ ఉష్ణోగ్రత 11.5గా నమోదైంది. ఆదిలాబాద్‌ ‌రూరల్‌ ‌పిప్పల్‌ధరిలో 11.1, తలమడుగులో 11.2, బేల మండలం చప్రాలలో 11.7, మావల మండలంలో 11.8, గాదిగూడలో కారికెలో 12.0, తాంసిలో 12.3, ఇంద్రవెల్లిలో 12.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మారుమూల గిరిజన గ్రామాలను దట్టమైన పొగమంచు కప్పేస్తుంది. ఉదయం 9గంటల వరకు బయటకు వెళ్లేందుకే ప్రజలు భయపడుతున్నారు. సాయంత్రం 5వరకే పనులను ముగించుకుని ఇళ్లలోకి వెళ్లిపోతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా వెచ్చని దుస్తులను ధరిస్తున్నారు. చలి మంటలు వేసుకుంటు వెచ్చదనం పొందుతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం కోరుతోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *