‘జువెల్స్‌ ఆఫ్‌ అసఫ్‌ జాహి – ద గ్లోరీ ఆఫ్‌ వరంగల్‌’ను ఆవిష్కరించిన సీఎస్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12 : సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కన్నెకంటి వెంకట రమణ రచించిన జువెల్స్‌ ఆఫ్‌ అసఫ్‌ జాహి – ద గ్లోరీ ఆఫ్‌ వరంగల్‌ అనే కాఫీ టేబుల్‌ బుక్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు బుధవారం ఆవిష్కరించారు. డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సిహెచ్‌.ప్రియాంక కూడా హాజరయ్యారు. వరంగల్‌ నగరంలో అసఫ్‌ Ûజాహీల హయాంలో నిర్మితమైన అద్భుత కట్టడాలు, వరంగల్‌ కేంద్రంగా పాలించిన సుబేదారుల వివరాలు వారి చరిత్రతో కూడిన ఈ కాఫీ టేబుల్‌ బుక్‌ చరిత్ర పరిశోధకులకు, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఉపయోగపడుతుందని సీఎస్‌ అన్నారు. పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే చారిత్రక అంశాలతో కూడిన ఈ కాఫీ టేబుల్‌ బుక్‌ను వెలువరించడం అభినందనీయమన్నారు. వరంగల్‌ అంటే కాకతీయుల పాలన, వేయిస్తంభాల ఆలయం, ఖిలా వరంగల్‌, భద్రకాళి ఆలయం వెంటనే జ్ఞప్తికి వస్తాయన్నారు. అయితే వరంగల్‌ నగరంలో అడుగుపెట్టగానే కాజీపేట నుండి మామునూర్‌ వరకు నిజాం నవాబులు నిర్మించిన అద్భుతమైన భవనాలు, కాజీపేట రైల్వే స్టేషన్‌, ప్రస్తుత మిషన్‌ భగీరథ పధకమైన ఇంటింటికీి తాగునీరందించే ధర్మసాగర్‌ ఫిల్టర్‌ బెడ్‌ ఎన్నో ఉన్నాయని, వీటితోపాటు వరంగల్‌ కేంద్రంగా వరంగల్‌ సుబాప్‌ాగా ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మంలోని కొన్ని ప్రాంతాలు ఉండేవన్నారు. ఈ వరంగల్‌ సుబేదారులుగా ఎవరెవరు ఉన్నారు. వారి ప్రత్యేకతలేమిటి, ఈ విషయమై కొన్ని అరుదైన, విశేషాలతో కూడిన సమాచారంతోపాటు నిజాం నిర్మిత హెరిటేజ్‌ కట్టడాల ఫోటోలతో కలిపి ఈ టేబుల్‌ బుక్‌ ఉంటుంది. ఈ పుస్తకం చరిత్ర అధ్యయనవేత్తలు, విద్యార్థులు, చరిత్రపై ఆసక్తి ఉన్న వారికి ఉపయోగపడుతుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *