బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరగాలి

– ఏటా ఉత్పత్తి, ఆదాయం విషయాల్లో పురోగతి సాధించాలి
– వీలైనన్ని సంస్కరణలు తీసుకురావాలి
– కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి

న్యూదిల్లీ, నవంబర్ 13: గతేడాది భారత బొగ్గు రంగం గణనీయమైన ప్రగతిని నమోదు చేసిన నేపథ్యంలో ఈసారి కూడా ఆ కార్డులను అందుకోవడమే కాకుండా అంత కుమించిన ప్రగతిని ఈ ఆర్థిక సంవత్సరంలో మా చేధించాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 5 నెలల సమయం మిగిలి ఉంది కాబట్టి ప్రత్యేక కార్యాచరణతో ముఖ్యంగా ఉత్పత్తి విషయంలో ఉన్న సమస్యలను అధిగమించి ముందుకెళ్లాలని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన కోల్ పీఎస్ యూల అర్ధ వార్షిక సమీక్షా సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈసారి వర్షాల కారణంగా ఉత్పత్తికి అంతరా యం కలిగింది. దీన్ని అర్థం చేసుకోగలం. కానీ తర్వాత పుంజుకుని ఉత్పత్తిపై దృష్టిసారిం చాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై అన్ని సబ్సిడరీల సీఎండీలు చొరవతీసుకోవాలి. పరి స్థితిలో మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత మీ పైనే ఉంది. ఏడాదికేడాది ఉత్పత్తి, రెవెన్యూ విషయంలో పురోగతి సాధించాలి. ఈ విష యంలో రాజీ పడొద్దన్నారు. వచ్చే మూడున్న రేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం సంస్కరణల ఆధా రంగానే నడవాలి. అందుకోసం అన్ని మంత్రిత్వ శాఖలు ప్రత్యేక వ్యూహంతో పనిచేస్తున్నాయి. మనం కూడా వీలైనన్ని సంస్కరణలు తీసుకొచ్చి బొగ్గు రంగాన్ని మరింత ప్రగతి ప థంలోకి తీసుకెళ్లాలన్నారు. మన వద్ద ఇంటిగ్రే టెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటి అత్యాధునిక వ్యవస్థ ఉంది. కానీ మనం దీన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. సాంకేతికతను వాడుకుంటూ వ్యవస్థను మరింత సరళంగా, ఫలితాలు సాధించేలా మార్చుకోవాల్సిన బాధ్యత మ‌న‌పై ఉంద‌ని కిష‌న్‌రెడ్డి అన్నారు..

ప్రతి సబ్సిడరీ కూడా ఇతర సబ్సిడరీలలో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను తెలుసుకుని అమలు చేయాలి. అంతర్జాతీయంగా ఉన్న ఉత్తమ పద్ధతులను పాటించాలి. మనం తీసుకున్న చిన్న నిర్ణయం కారణంగా ఇవాళ రూ.కోటి ఇన్సూరెన్స్‌ పథకాన్ని మన ఉద్యోగులకు, మన కార్మికులకు అందిస్తున్నాం. ఇదే విధంగా మరిన్ని కొత్త నిర్ణయాలతో.. మంచి మార్పులు తీసుకొచ్చే దిశగా కృషిచేయాలి. సెంట్ర‌ల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్‌ ( సీఎంపీడీఐ) ఓవర్‌ బర్డన్‌ టెస్టింగ్‌ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిరంతరం శాంపిల్‌ టెస్టింగ్‌ చేస్తూ రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ ఉత్పత్తిపై పనిచేయాలి. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సానుకూలంగా స్పందిస్తూ.. మనకు వెంటవెంటనే అనుమతులు ఇస్తోంది. ఈ విషయంలో మరేమైనా సమస్యలున్నా వెనువెంటనే పరిష్కరించుకునే అవకాశం ఉంది. కోల్‌ వాషరీస్‌ విషయంలో మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలి. వాషరీస్‌తో క్వాలిటీ పెరుగుతుంది. బొగ్గు దిగుమతులు తగ్గుతాయి. అందుకే దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించాలి. సబ్సిడరీ లెవల్లో సబ్‌ కమిటీలను ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభించాలి. కార్మికుల సంక్షేమం, వారి ఆరోగ్య సంరక్షణ విషయంలో.. రాజీపడొద్దు. దీంతోపాటు %ఖూజ% విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించే విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలి. మైన్‌ క్లోజర్‌ విషయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలి. మైన్‌ క్లోజర్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. మూడేళ్లలో 141 డీకోల్డ్‌ మైన్స్‌ను మూసేస్తామని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ విషయంలో రాజీ పడకుండా సీఎండీలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలి  అని కిష‌న్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్‌ చంద్ర దూబే, బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్‌ దేవ్‌ దత్‌, కోలిండియా చైర్మన్‌, బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి సనోజ్‌ కుమార్‌ ఝా, అదనపు కార్యదర్శి  రూపిందర్‌ బ్రార్‌, మంత్రిత్వ శాఖ అధికారులు, సబ్సిడరీల సీఎండీలు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page