18‌న ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటన

– సీపీఐ మహాసభలకు హాజరు

ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 14: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.  ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న సీపీఐ జాతీయ మహసభల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. అదేరోజు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో రూ.25 కోట్లతో నూతనంగా నిర్మించిన మద్దులపల్లి మార్కెట్‌ ‌యార్డ్, ‌రూ.25 కోట్లతో నిర్మించిన నర్సింగ్‌ ‌కళాశాల ను సీఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రారంభించనున్నారు. అదేవిధంగా రూ.108 కోట్లతో నిర్మించబోయే జేఎన్‌టీయూ భవన నిర్మాణానికి వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. అందులో భాగంగా మద్దులపల్లి మార్కెట్‌ ‌యార్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ ‌ప్రాంతాన్ని సీపీ సునీల్‌దత్‌, ఏదులాపురం మున్సిపల్‌ ‌కమిషనర్‌ శ్రీ‌నివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ ‌పిల్లి.రాంప్రసాద్‌, ‌మార్కెట్‌ ‌చైర్మన్‌ ‌హరినాదబాబులు పరిశీలించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *