- సలహాలివ్వాలని చూస్తే మా గొంతు నొక్కేస్తున్నారు..
- మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు
సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న పార్టీ ఫిరాయింపుల విషయమై నిబంధనలకు విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సభలో ముఖ్యమంత్రి మాట్లాడింది పూర్తిగా అసెంబ్లీ పార్లమెంట్ వ్యవస్థకు విరుద్ధమని తెలిపారు. కోర్టులో పెండింగులో ఉన్న విషయాలను చట్టసభల్లో మాట్లాడకూడదని కౌల్ అండ్ శకధర్ పార్లమెంటరీ ప్రొసీజర్ బుక్ లో స్పష్టంగా ఉంది. కోర్టు పరిధిని అధిగమించి ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నా కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ విషయంపై జడ్జిమెంట్ ఇచ్చారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు డిస్ క్వాలిఫై కారు, ఉప ఎన్నికలు రానే రావు అని తీర్పు ఇచ్చేశారు.. ముఖ్యమంత్రి తన పరిధిని దాటి సుప్రీంకోర్టులో ఉన్న విషయం మీద మాట్లాడడం అసెంబ్లీ ప్రివిలేజ్ కిందకే వొస్తుంది. పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద నేను చెప్పే ప్రయత్నం చేస్తే మధ్యలో నా మైక్ కట్ చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశాం. సలహాలు ఇవ్వాలంటే ఇవ్వచ్చని ముఖ్యమంత్రి చెప్పారు, కానీ సలహాలు ఇవ్వడానికి మైక్ ఇవ్వాలని కోరితే ఇవ్వలేదు. ప్రతిపక్షం గొంతు నొక్క ప్రయత్నం చేస్తున్నారు. తక్కువ సభ్యులు ఉన్నవారికి మైక్ ఇస్తున్నారు, మాకు ఇవ్వడం లేదని ఆరోపించారు.



ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే