హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భక్తులు సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ప్రార్థిస్తున్నానన్నారు.. భక్తులంతా దర్శనానంతరం క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినందున ఇతరత్రా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





