– శృంగేరి జగద్గురువులు భారతీస్వామిని కలిసిన రేవంత్, ఆది శ్రీనివాస్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: నల్లకుంటలోని శంకరమఠంలో గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఉన్నారు. శంకర మఠానికి వేంచేసి ఉన్న శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతీస్వామి వారిని వారిద్దరూ మర్యాదపూర్వకంగా కలిశారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా స్వామి వారు హైదరాబాద్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను భారతీస్వామి వారికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆది శ్రీనివాస్‌లు వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





