ప్రజలకు సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 18: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నుంచి శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుందంటూ కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, పాడి పంటలతో రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని అభిలషించారు. గత ఏడాది ఉగాది పండగ రోజున రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించామని సీఎం గుర్తు చేశారు. ఈ ఏడాదిలో రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలు చాటిచెప్పేలా అందరూ ఉగాది పండగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *