హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23:భారత మాజీ ప్రధామంత్రి స్వర్గీయ పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఘనంగా నివాళి అర్పించారు. ఆర్థిక సంస్కరణల దార్శనికుడు పీవీ నర్సింహారావు అని కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని స్థిరత్వం వైపు నడిపిన అపూర్వ మేధావి, బహుభాషా పండితుడని, పరిపాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు. తెలంగాణ బిడ్డ దేశ ప్రధానిగా ఎదిగి, ప్రపంచ పటంలో భారతదేశానికి గౌరవం పెంచిన మహనీయుడని, ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.