– జూబ్లీహిల్స్ గెలుపుతో కాంగ్రెస్‌లో ఉత్సాహం
– వరుసగా రెండు సీట్లు గెలుచుకున్న ఘనత
– కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌తో నగరంలో ఖాతా
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రచించిన వ్యూహం ఫలించింది. ఈ ఎన్నికకు సంబంధించి చివరి వారం వరకు కాంగ్రెస్ నేతల్లో నమ్మకం కనిపించని పరిస్థితి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి రేవంత్ చివరి వరకు సూచనలు చేస్తూ ఏం చేయాలో దిశానిర్దేశం చేయడంతోపాటు స్వయంగా ప్రచారం చేయడం హస్తం నేతల్లో జోష్‌ను నింపింది. పోల్ మేనేజ్‌మెంట్‌పై బూత్ ఏజెంట్లకు, బూత్ ఇన్‌చార్జిలకు సీఎం సందేశం ఇచ్చారు. అధికారం చేపట్టిన తరవాత రేవంత్‌కు ఇది రెండో విజయమని చెప్పాలి. తొలుత కంటోన్మెంట్ దక్కించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీహిల్స్ కైవసం చేసుకుంది. దీంతో జంటనగరాల్లో కాంగ్రెస్ ఖాతాలో రెండు సీట్లు పడ్డాయి. ప్రధానంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించి పోల్‌మేనేజ్‌మెంట్‌లో టాప్ లేపారు. మొత్తానికి తనపై ఇన్ని రోజులుగా వస్తున్న విమర్శలకు రేవంత్ గెలుపుతో సమాధానం చెప్పారు. జూబ్లీహిల్స్ గెలుపుతో ముఖ్యమంత్రి మరింత సమర్థ నేతగా నిలవనున్నారు. ఇకపై సీఎం రేవంత్ గేరు మార్చి స్పీడ్ పెంచనున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కౌంటింగ్ పక్రియలో మొదట పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ఆధిక్యం కనపబరచగా.. ఆ తరువాత ఒక్కో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మెజార్టీతో దూసుకెళ్లారు. రౌండ్ రౌండ్‌కు కాంగ్రెస్ లీడ్ పెరుగుతూ వస్తోంది. మొదటి రౌండ్ – 47, రౌండవ రౌండ్‌లో 2995, మూడవ రౌండ్‌లో 2843, నాల్గవ రౌండ్‌లో 3547 వోట్లు ఇలా ఒక్కో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. చివరకు ఏడో రౌండ్ ముగిసిన తర్వాత 19 వేలకు వోట్లకు పైగా స్పష్టమైన ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది.ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు దాదాపు ఖాయమవడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేలుస్తూ, డ్యాన్స్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ నుంచి ఉప ఎన్నికల ఫలితాలను మంత్రులు పొన్నం ప్రభాకర్,వివేక్ వెంకట్ స్వామి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు,కార్పొరేషన్ చైర్మన్‌లు, ఇతర ముఖ్య నేతలు సక్షించారు. ఒక్కో రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ వొస్తుండడంతో మంత్రులు , ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేసారు. అయితే.. ఈ ఎన్నికకు సంబంధించి మంత్రులకు పలు డివిజన్ బాధ్యతలను సిఎం రేవంత్ అప్పగించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రహమత్ నగర్‌లో పూర్తి మెజార్టీ తెచ్చిపెట్టారు. రహమత్ నగర్ లో పొంగులేటి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్ నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకుని గ్రౌండ్ ఖాలీ చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరిలకు వెంగల్‌రావు నగగర్ బాధ్యతలు అప్పగించారు. ఇందులోనూ కాంగ్రెస్‌కి అత్యధిక వోట్లు సాధించాయి. కమ్మ సామాజిక వర్గం ఏకతాటి దకు తేవడంలో తుమ్మల కీలక పాత్ర పోషించారు. షేక్‌పేటలో మంత్రులు కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి అంతంత పెర్ఫార్మెన్స్ చూపించారు. మంత్రి దామోదర రాజనర్సింహా ఎర్రగడ్డలో మెజార్టీ చూపారు.యూసఫ్‌గూడలో మంత్రి ఉత్తమ్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ లీడ్ చేశారు. ఎర్రగడ్డలో మైనార్టీల మత పెద్దలులతో టింగులు.. అపార్ట్ మెంట్ వాసుల టింగులు కొనసాగాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





