– చట్ట సభలకు రాని వారికి పేద ప్రజల కష్టం ఏం తెలుసు?
– పాలమూరు బిడ్డగా వారి బాధలు నాకు తెలుసు : సీఎం రేవంత్
– కేసీఆర్ సలహాలు, సూచనల కోసం సభకు ఆహ్వానించాం
– బట్టలు ఊడదీస్తామన్న వారు చర్చకు ఎందుకు రాలేదు?
– సభలోకి రాము అని అనడం చట్ట సభలను అవమానించడమే
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 3: వల సల జిల్లా పాలమూరు బిడ్డగా కరువు కష్టాలు, పేదరికం ఎలా ఉంటుందో నాకు పూర్తిగా తెలుసునని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభలో శనివారం మాట్లాడుతూ ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై కేసీఆర్ తన అనుభవంతో సూచనలు ఇస్తారని అనుకున్నాం. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఎలా ఉపయోగపడతాయో, అందుకే కృష్ణా జలాలపై ఒకరోజు, గోదావరి జలాలపై ఒకరోజు సభలో చర్చిద్దామని ఆ హ్వానించాం. తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని, ఇందుకు కాంగ్రె స్ కారణమని కెసీఆర్ విమర్శించారు. ఈ సభకు ఒక పవిత్రత ఉంది. సభలో జరిగే చర్చలను, విషయాలను, అందులోని వాస్తవాలను ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో నమ్ముతారు. ఎందుకంటే… ఇక్కడ అబద్ధానికి ఆస్కారం లేదు. మాటల గారడీలకు స్థానం లేదు. ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలే తప్ప రాజకీయ ప్రయోజనాలకు ఇది వేదిక కాబోదు. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ప్రాతినిధ్యానికి ప్రతిరూపం ఈ సభ. ఈ సభలో మాట్లాడే ప్రతిమాట రాష్ట్ర ప్రయోజ నాలే పరమావధిగా ఉంటుందన్న నమ్మకం ప్రజల్లో ఉంటుంది. గడచిన రెండేళ్లుగా ప్రతి పక్ష నాయకుడు సభకు రావడం లేదు. సభకు రండి అని నేను పదే పదే విజ్ఞప్తి చేశా. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అని చెప్పు కునే ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రాలేదు. సభలోకి రాము, చర్చలో పాల్గొనం అని హరీష్ రావు మాట్లాడటం చట్టసభలను అవ మానించడమే. మీరు సభ పెట్టండి మీ బట్టలు వూడదీస్తామన్నారు. తోలు తీస్తామని కేసీఆర్ మాట్లాడారు. వారు సభలో చర్చలో పాల్గొని ఉంటే ఎవరి బట్టలు ఎవరు ఊడదీస్తారు, ఎవరి తోలు ఎవరు తీస్తారు అనేది ప్రజలకు తెలిసేదన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





