– ప్రాముఖ్యత ఆధారంగా ప్రాజెక్టుల బిల్లులు చెల్లింపులు
– అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 3ః కృష్ణా నదిపైనున్న ప్రాజెక్టులు ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి సహా అన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్షలు చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పారు. ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్‌కు సంబంధించి ప్రజాప్రభుత్వం చాలా సీరియస్ గా పనిచేస్తోందన్నారు. ప్రాజెక్టుల ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకుని బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు కృష్ణానది ప్రాజెక్టులపై సమీక్షలు చేస్తున్నారని, అంతేకాక పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారని కూడా చెప్పారు. పెండింగ్ బిల్లుల విషయంలో కాంట్రాక్టర్లదే ఆలస్యం తప్ప ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేవని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



