– ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా హైదరాబాద్‌కు మెస్సీ
– చరిత్రలో అరుదైన ఘట్టం
– మ్యాచ్ తిలకించిన రాహుల్, ప్రియాంక కుమార్తె, కుమారుడు
– ఉప్పల్ స్టేడియంలో ఊర్రూతలూగిన అభిమానులు
– హైదరాబాద్ ఆతిథ్యంపై సర్వత్రా ప్రశంసలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: అ ర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ కొనసాగుతోం ది. గోట్ కప్ పేరుతో ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్ శనివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జట్లు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాయి. సింగరేణి ఆర్ ఆర్ టీమ్ తరఫున మైదానంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి గోల్ కొట్టారు. మెస్సి రెండో గోల్ రాబట్టారు. మ్యాచ్ ప్రారంభానికి ముం దు ఇరు జట్లతో కలిసి మెస్సి, రేవంత్ ఫొటోలు దిగారు. గ్యాలరీలో ఉన్న అభిమానులకు మెస్సి.. ఫుట్‌బాల్ కిక్ చేసి గిప్ట్ ఇచ్చారు. రాహుల్ గాంధీతోపాటు ప్రియాం కగాంధీ కుమారుడు, కుమార్తె ఫుట్ బాల్ మ్యాచ్ ను వీక్షించారు.
ఉప్పల్ స్టేడియంలో అరుదైన ఘట్టం : మెస్సీ అభిమానుల సందడి
హైదరాబాద్లో ఫుట్బాల్ అభిమానులకు మరుపురాని దృశ్యం ఆవిష్కృతమైంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ తొలిసారి నగరానికి రాగా ఉప్పల్ స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. మెస్సీతోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్టేడియంకు చేరుకోవడంతో ఉప్పల్ ప్రాంతంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. మెస్సీ గౌరవార్థం, క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఉప్పల్ స్టేడియంలో ఒక ప్రత్యేకమైన ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ ను ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్‌లో సింగరేణి ఆర్ఆర్ టీమ్, అపర్ణ మెస్సీ టీమ్ తలపడ్డాయి. సింగరేణి ఆర్ఆర్ టీమ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించగా, అపర్ణ టీమ్లో లో లియోనల్ మెస్సీ భాగమయ్యారు.
ఈ మ్యాచ్ ని తిలకించడానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ముందుగా గ్రౌండ్ లోకి రేవంత్ రెడ్డి రాగా మ్యాచ్ చివరి ఐదు నిమిషాల్లో మెస్సీ గ్రౌండ్ లోకి దిగి తన జట్టు తరపున ఆడారు. ఈ అరుదైన దృశ్యాన్ని అభిమానులు ఉత్కంఠగా తిలకించారు. ఒక ముఖ్యమంత్రి, ప్రపంచ స్థాయి క్రీడాకారుడు ఒకే వేదికపై ఆడటం నగర చరిత్రలోనేకాక దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





