కేరళంలో సీఎం రేవంత్ రోడ్ షో

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: కేరళంలో ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. అక్కడి ఎస్ఎం లాక్ జంక్షన్ నుంచి ముట్టతార వరకు బుధవారం రోడ్ షోలో పాల్గొని స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, పినరయ్ విజయన్‌కు తేడా ఏమీ లేదని, కేరళం ప్రజలు తెలివైన వారు, విద్యాధికులని,  కేరళం ప్రజలు మతతత్వ శక్తులను ఎప్పటికీ అనుమతించరని అన్నారు. మతతత్వ శక్తులు కేరళంలోకి ప్రవేశించకుండా ఇక్కడి ప్రజలు లక్ష్మణ రేఖ గీశారన్నారు. కానీ నరేంద్ర మోదీ.. పినరయ్ విజయన్ ద్వారా కేరళం భవిష్యత్‌ను అపహరించాలని చూస్తున్నారని విమర్శించారు. అందుకే బీజేపీ నాయకులు తమ ఓటు బ్యాంకును పినరయ్ విజయన్ కు బదిలీ చేయించేందుకు చూస్తున్నారని, కేరళంలో కాంగ్రెస్, మిత్రపక్షాలు గెలవకూడదని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది కేరళం ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అని అన్నారు. పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించి కేరళంను అభివృద్ధి చేసేవారికే ఓటు వేయండి అని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *