స్వ‌గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌

  • కొండారెడ్డిప‌ల్లిలో హ‌నుమాన్ ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు
  • హాజ‌రైన రాష్ట్ర‌ మంత్రులు

కొడంగల్, ప్రజాతంత్ర, మే 19 : నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంత‌కుముందు ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం, రైతులు సుభిక్షంగా ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

 

కార్యక్రమంలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ‌మంత్రి శ్రీధర్ బాబు, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వివిధ  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, స్థానిక ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *