ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి

మూడు కేసుల్లో విచారణ..
మార్చి 23కి వాయిదా వేసిన కోర్టు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి20: నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్‌రెడ్డిపై నల్గొండ టూటౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో, బేగంబజార్‌ ‌పీఎస్‌లో, మెదక్‌ ‌జిల్లా కౌడిపల్లి పీఎస్‌ ‌పరిధిలో మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ నిమిత్తం ఆయన కోర్టుకు హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేసిందని టీపీసీసీ లీగల్‌సెల్‌ ‌వైస్‌ ‌ఛైర్మన్‌ ‌తిరుపతి వర్మ తెలిపారు. తదుపరి విచారణను ప్రజాప్రతినిధుల కోర్టు మార్చి 23కి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *