హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: మహారాష్ట్ర రాజధాని ముంబైలో మూడు రోజుల పాటు జరిగే ముంబై క్లైమెట్ వీక్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ముంబై వెళ్లారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ముంబై క్లైమెట్ వీక్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ విస్తృత ప్రగతి, పరిపాలన సంబంధిత అంశాల్లో రాష్ట్ర విజయాలను ఈ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి వివరించsనున్నారు. మంగళవారం నుండి 19వ తేదీ వరకు మూడు రోజులపాటు ముంబై క్లైమెట్ వీక్ అంతర్జాతీయ సదస్సు బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో కన్వన్షన్ సెంటర్‌లో జరుగుతున్నది. మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై కార్పొరేషన్ భాగస్వాములుగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




