కుటుంబ సర్వేలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి..

వివరాలు నమోదు చేసిన అధికారులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 28 : ‌సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తన కుటుంబ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఎన్యుమరేటర్‌, అధికారులు.. సీఎం రేవంత్‌ ‌చెప్పిన కుటుంబ వివరాలను నమోదు చేశారు. హైదరాబాద్‌ ‌కలెక్టర్‌ అనుదీప్‌, ‌జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌ ఇలంబర్తి, సీఎం స్పెషల్‌ ‌సెక్రటరీ అజిత్‌ ‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివరాలు నమోదు చేసిన అనంతరం అధికారులతో సీఎం రేవంత్‌ ‌మాట్లాడారు.

సర్వే పురోగతి గురించి ఆరాతీశారు. సర్వేపై ప్రజల స్పందన ఎలా ఉందని  అడిగి తెలుసుకున్నారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఎం‌పీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్‌ ‌నిర్వహించి, వివరాలు నమోదు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా సర్వేలో కచ్చితంగా నమోదు చేయాలన్నారు.  వీలైనంత  త్వరగా సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *