నా మాట‌ల‌ను ఎడిట్‌ ‌చేసి ప్రచారం చేస్తున్నారు

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 3: టీపీసీసీ స‌మావేశంలో అంత‌ర్గ‌తంగా మాట్లాడిన త‌న మాట‌ల‌ను ఎడిట్‌ ‌చేసి ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై ముఖ్య‌మంత్రి రేవంత్‌ ‌మండిపడ్డారు. దిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న మీడియాతో చిట్‌చాట్‌ మాట్లాడుతూ తెలంగాణలో పదేళ్లు తన నేతృత్వంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉంటుందని అన్నారు. హిందూ సమాజంలాంటిదే కాంగ్రెస్‌ అని డీసీసీ అధ్యక్షులకు చెప్పానని,  పార్టీ నేతగా ఎలా పనిచేయాలనేది వివరించే క్రమంలో చెప్పానని అన్నారు. జూబ్లీహిల్స్‌లో డిపాజిట్‌ ‌కోల్పోవడంతో బీజేపీ దీన్ని వివాదం చేస్తోందని మండిపడ్డారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన వ్యాఖ్యలను ఉత్తర భారతంలోనూ తనను పాపులర్‌ ‌చేస్తున్నందుకు సంతోషమని వ్యాఖ్యానించారు. తాను కాంగ్రెస్‌ ‌పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన విషయాల్లో ముందు వెనక కట్‌ ‌చేసి కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లు మూడు కోట్ల మంది ఉన్నారని, పలు సారూప్యతలు కలిగిన దేవుళ్లు ఉన్నారని తాను చెప్పానని అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ ‌కూడా హిందూ సమాజం లాంటిదేనని అని పోలుస్తూ తాను వ్యాఖ్యానించానని స్పష్టత ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *