– హైదరాబాద్‌కు వచ్చిన సీజేఐకు ఘనస్వాగతం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: హైదరాబాద్ నగరానికి శనివారం వచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శంషాబాద్‌లోని హోటల్ నోవాటెల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఆదివారం ఉదయం 10.30 గంటలకు జరుగనున్న రాష్ట్ర హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన రాష్ట్రానికి వచ్చారు. అంతకుముందు శంషాబా< విమానాశ్రయంలో జస్టిస్ సూర్యకాంత్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, ఇతర ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



