సీఎం ప్రజావాణి స్ఫూర్తి దాయకం

– మధ్య ప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 14: సీఎం ప్రజావాణి ప్రజల సమస్యలను పరిష్కారంలో తీసుకుంటున్న చర్యలు,  ప్రజల కోసం అమలు చేస్తున్న పంథాను స్ఫూర్తిగా తీసుకుని మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇదే తరహా కార్యక్రమాన్ని అమలు చేస్తామని డిప్యూటీ కలెక్టర్స్ ప్రతినిధి ఆదిత్య నారాయణ తివారి తెలిపారు. ఈ సందర్బంగా సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ లతో వారు భేటీ అయ్యారు. సీఎం ప్రజావాణి అమలు తీరును, ప్రజల సమస్యల పరిష్కారంలో అనుసరిస్తున్న విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చిన్నారెడ్డి, దివ్య డిప్యూటీ కలెక్టర్లకు వివరించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని 24 మంది డిప్యూటీ కలెక్టర్లు సీఎం ప్రజావాణిని సందర్శించి ఇక్కడి అనుభవాలతో తమ రాష్ట్రంలోనూ  ఇదే తరహా పద్ధతిని అమలు చేసి ప్రజల మన్ననలు పొందుతామని డిప్యూటీ కలెక్టర్లు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *