హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 15: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 296 దరఖాస్తులు అందాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 60, రెవెన్యూ శాఖకు సంబంధించి 63, విద్యుత్ శాఖకు 22, పౌర సరఫరాల శాఖకు 7, ఇందిరమ్మ ఇండ్ల కోసం 57 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 144 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్యదేవరాజన్ దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించారు.
సీఎం ప్రజావాణిలో 296 దరఖాస్తులు


