– ఐఏఎస్ మహిళా అధికారిని కించపరిచేలా వార్తలు
– రెండు ఘటనలపై ‘సిట్’ ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు
– నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్‌కు బాధ్యతలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 13: హైదరాబాద్ సీసీఎస్‌తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్‌లో నమోదైన సంచలన కేసుల్లో డీజీపీ శివధర్ రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందంఏర్పాటు చేశారు. ఈ సిట్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నాయకత్వం వహించనున్నారు. మొత్తం ఎనిమిది మంది సభ్యులతో ఈ ప్రత్యేక బృందాన్ని డీజీపీ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోలను అసభ్యకరంగా పోస్ట్ చేసిన వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సాప్ గ్రూప్‌నకు చెందిన కావలి వెంకటేశ్‌పై కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఫిర్యాదు మేరకు ఈ నెల 11న మద్దూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఓ మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచే విధంగా వార్తలు టెలికాస్ట్ చేసిన వ్యవహారంలో హైదరాబాద్ సీసీఎస్‌లో మరో కేసు నమోదైంది. ఈ కేసులో రెండు తెలుగు న్యూస్ ఛానల్స్, ఏడు యూట్యూబ్ ఛానళ్లపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేశ్ రంజన్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ రెండు కీలక కేసుల్లో దర్యాప్తు బాధ్యతను సిట్‌కు అప్పగించారు. నారాయణపేట జిల్లా మద్దూర్, హైదరాబాద్ సీసీఎస్‌లో నమోదైన కేసులపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్‌లో సభ్యులుగా నార్త్ రేంజ్ జాయింట్ సీపీ శ్వేత, చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్, హైదరాబాద్ అడ్మిన్ డీసీపీ వెంకటలక్ష్మి, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, విజిలెన్స్ అదనపు ఎస్పీ ప్రతాప్, సీసీఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర, సైబర్‌సెల్ ఇన్‌స్పెక్టర్ శంకర్‌రెడ్డి, సైబర్‌సెల్ ఎస్సై హరీశ్ ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.