న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన దిల్లీలోని ఇందిరా భవన్‌లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, జైరాం రమేష్, సల్మాన్ ఖుర్షిద్, అంబికా సోనీ, సచిన్ పైలట్, భూపేష్ బఘేల్ తదితర కీలక నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కుతో కలిసి కీలక చర్చల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





