కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి

ముఖ్యమంత్రి ఆదేశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
దిల్లీిలో ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్‌లోని తన కార్యాలయ అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చెరువులు, కుంటలు నిండి వరద నీటి ఉదృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఎప్పడికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *