– కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
– దిల్లీలో ముఖ్యమంత్రి బిజీబిజీ
– కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడులతో భేటీ
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి దిల్లీలో గురువారం బిజీబిజీగా గడిపారు. పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలుసుకున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కలిసి ఈనెల చివరి వారంలో హైదరాబాద్‌లో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఈసా-మూసీ నదుల సంగమ స్థలంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. 1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితభస్మాన్ని ఈసా-మూసీ సంగమ స్థలిలో నిమజ్జనం చేశారని కేంద్ర మంత్రికి తెలియజేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. బాపూఘాట్‌ను ప్రపంచస్థాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలపనున్నట్లు తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో శాంతి చిహ్నం, జాతీయ మ్యూజియం, విజ్ఞాన కేంద్రం, చేనేత ప్రోత్సాహక కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీ కృష్ణ, ఎం.అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. అలాగే రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కూడా సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు.
మామునూరు ఎయిర్‌పోర్టు పనులు చేపట్టాలి 
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా సీఎం రేవంత్ భేటీ అయ్యారు. వరంగల్ మామూనూరు విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తి అయినందున అవసరమైన పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం ఎయిర్ పోర్టుకు పాల్వంచలో స్థలం గుర్తించినందున ఓఎల్‌ఎస్ సర్వే, ఫీజుబిలిటీ స్టడీ నిర్వహించాలని కోరారు. అంతర్గాం ఎయిర్ పోర్టుకు ప్రత్యమ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి అదనంగా 249.82 ఎకరాల భూమి సిద్ధంగా ఉన్నట్లు సీఎం తెలియజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





