– ప్రపంచంతోనే పోటీపడేలా స్కిల్డ్ యూత్
– కొత్త రంగాల్లో కొంగొత్త మార్గాల అన్వేషణ
– తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా డాక్యుమెంట్
– మూడు రీజియన్లుగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి
– తెలంగాణ రైజింగ్-2047 సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తె లంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్ లో కనిపించాలన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి, పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా విభజించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండదని చాటి చెప్పేలా రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలన్నారు. వాస్తవిక దృక్ప థం కనిపించేలా డిజైన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, యువతకు మెరుగైన ఉపాధి లక్ష్యంగ తెలంగాణ ప్రభుత్వం విజన్ 2047కు సిద్ధమౌతోంది. అందరికీ సమాన అవకాశాలు, సమీకృత అభివృద్దే టార్గెట్ గా రానున్న 22 ఏండ్లకు ఈ భవిష్యత్ కార్యా చరణ ఉండబోతోంది. భవిష్యత్ ను కొత్త పుంతలు తొక్కించే దిశగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమౌతోంది. దీనిపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో గ్లోబల్ సమ్మిట్-2025పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, అజారుద్దీన్, సీతక్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధి కారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఉన్నఅపారమైన పెట్టుబడుల అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఉంచటంతోపాటు ఇక్కడ ఇన్వెస్ట్ చేయటం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ రెండు రోజుల్లో షో కేస్ చేయటమే లక్ష్యంగా ప్రభు త్వం పెట్టుకుంది. అందుకే ఈవెంట్ ను కూడా భవిష్యత్ ఫోర్త్ సిటీలో ప్రభుత్వం ప్లాన్ చేసింది. విభిన్న రంగాల్లో పారిశ్రామిక అభివృద్ధికి గల అవకాశాలను వివరించటం, వివిధ రూపాల్లో ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 దార్శనిక భవిష్యత్ పత్రం, రాష్ట్ర భవిష్యత్తుకు సమగ్ర మార్గరూపం. సమాన వృద్ధి, మహిళా సాధికారత, యువశక్తి, స్థిరమైన అభివృద్ధి ఈ మూ డు ప్రధాన రంగాలపై రాష్ట్ర అభివృద్ధి వ్యూహాన్ని ప్రభుత్వం ప్లాన్ చేసింది. తెలంగాణను దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడం ఈ విజన్ డాక్యుమెంట్ లక్ష్యం. చిన్న రాష్ట్రమైనా ఇక్కడ ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి తెలియజేయాలని ప్రజా ప్రభుత్వం సంకల్పిం చింది. అభివృద్దిలో పక్క రాష్ట్రాలతో కాదు చై నా, జపాన్ లతోనే పోటీ పడే లక్ష్యాలతో ముందుకుపోతోంది. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పే స్, క్వాంటమ్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు. స్టార్టప్, ఎంఎస్ఎంఈలు, టూరిజం, ఎగుమ తులు వంటి రంగాలు రానున్న రెండు దశాబ్దాల్లో ఆర్థిక వృద్ధికి కీలక రంగాలని ప్రభుత్వం భావిస్తోంది. పారదర్శక పాలన, సులభ అనుమతులు గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు రాష్ట్రాన్ని పెట్టుబడిదా రుల మొదటి గమ్యస్థానంగా నిలబెట్టనున్నాయి. ఈ బలాలే పునాదిగా మరిన్నిపెట్టుబడులను ఆకర్షించే విధంగా విజన్ డాక్యుమెంట్ ఉండబోతోంది. హైదరాబాద్ కోర్ అర్బన్, సెమీ అర్బన్, గ్రా మీణ తెలంగాణను మూడు జోన్లుగా అభివృద్ధి సమతుల్యత సాధించాలని ప్రభుత్వం భావి స్తోంది. అదే సమయంలో గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతం చేసేందుకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా వ్యవసాయ కార్యాచరణ కూడా విజన్ డాక్యుమెంట్ లో భాగమౌతోంది. రాష్ట్ర అభివృద్ధిలో మహిళా సాధికారత కూడా అత్యంత ప్రధానమైన అంశంగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోం ది. డెవలప్మెంట్ ఎకానమీలో కాలుష్యం వల్ల కలిగేనష్టాలపై కూడా ఈ విజన్ డాక్యుమెంట్ ఫోకస్ చేస్తోంది. అందుకే నెట్-జీరో తెలంగాణను అవిష్కరించనుంది.బ్లూ & గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా తెలంగాణ 2047 డాక్యుమెంట్ లో మూసీ పునరుజ్జీవం, దీనిలో భాగంగా 2959 చెరువులు, పార్కులు, అటవీ ప్రాంతాలను వాటి పూర్వ స్థితికి తీసుకు రావటం లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమ యంలో గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు, పరి శుభ్రమైన రోడ్లు, సౌర విద్యుత్ వెలుగులతో విలేజ్ 2.0 లక్ష్యంతో పనిచేయనుంది. ఇక మరో లక్ష్యంగా ఆధునిక రవాణ మౌలిక సదుపాయాల కల్పనను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో తెలంగాణకు మణిహారంలా రీజనల్ రింగ్ రోడ్డును ప్రభు త్వం అభివృద్ధి చేస్తుంది. హై-స్పీడ్ మొబిలిటీ కారిడార్లను నిర్మించనుంది. రీజనల్ రింగ్ రైల్, 4 ఇండస్ట్రియల్ కారిడార్లు, 11 రేడియల్ రోడ్లను నిర్మించనుంది. వరంగల్, నిజామాబాద్, అదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రాయాలను ఏర్పాటు చేయబోతోంది. హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు అత్యాధునిక హైవేను నిర్మించి సీపో ద్దుకు అనుసంధానం చేయబోతోంది. గ్లోబల్ వర్క్ ఫోర్స్ తో పోటీపడేలా ప్రతీ యేడాది రెండు లక్షల తెలంగాణ యువతకు, లక్షమంది నిపుణులకు విదేశీ ఉపాధికి అవసరమైన నైపుణ్య అభివృద్ధి టార్గెట్ గా ప్రణాళికలు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రా లుగా స్పోర్ట్స్ విలేజీల నిర్మిస్తారు. మానసిక ఆరోగ్యం, యోగా, ధ్యానం, క్రీడలు, సాంస్కృతిక అవగాహనతో సమతుల్య యువత అభివృద్ధి కోసం హోలిస్టిక్ వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించటమే లక్ష్యంగా టూరిజం ప్రాంతాల అభివృద్ధి, నైట్ ఎకానమీ సిటీగా హైదరాబాద్ ఇమేజ్ ను క్రియేట్ చేయటం, బతుకమ్మ, బోనాలు, డెక్కన్ క్రాఫ్ట్స్ గ్లోబల్ పండుగలతో బ్రాండ్ తెలంగా ణను విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పించారు. ప్రపంచ సినిమా రంగాన్ని ఆకర్షిస్తూ యానిమేషన్, గేమింగ్, ఫిలిం-టెక్ పరిశ్రమలకు కొత్త గమ్యంగా రూపొందే లక్ష్యంతో పనిచేస్తారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంతోపాటు గ్లోబల్ సిటీ హైదరాబాద్ దాకా సమాన అవకా శాలు, స్థిరమైన అభివృద్ధి అనే లక్ష్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ -2047 మార్గదర్శకంగా ఉండబోతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





